04-10-2025 02:10:19 AM
వాషింగ్టన్, అక్టోబర్ 3: ‘ఇజ్రాయెల్ -హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు హమాస్ గాజా ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. హమాస్‌కు ప్రత్యక్ష నరకం చూపిస్తా. హమాస్ ఆదివారం (ఈ నెల 5వ తేదీ) సాయంత్రం 6 గంటల వరకు (అమెరికా కాలమాన ప్రకారం) గడువు విధిస్తు న్నా’ అంటూ శుక్రవారం అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశా రు. హమాస్‌కు ఇది చివరి అవకాశమని పేర్కొనడం కొసమెరుపు.
నోబెల్ శాంతి బహుమతి వచ్చేనా..
ఈనెల 10న నార్వేజియన్ నోబెల్ కమిటీ శాంతి బహుమతి ప్రకటించేందుకు కమిటీ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తనను శాంతి బహుమతి వరిస్తుందా.. లేదా.. అన్న టెన్షన్ పట్టుకున్నది. ట్రంప్‌కు శాంతి బహుమతి కట్టబెట్టాలని ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం నోబెల్ కమిటీకి ప్రతిపాదన పంపించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు సైతం స్వయంగా అమెరికా వెళ్లి నోబెల్ బహుమతి ప్రతిపాదనను శ్వేతసౌధంలో ట్రంప్‌కు బహూకరించిన సంగతి తెలిసిందే.
పాక్, ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా కాంబోడియా, అర్మేనియా, అజర్ బైజాన్, రువాండ వంటి దేశాలు కూడా ట్రంప్‌ను నామినేట్ చేశాయి. ఇక ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి అంశంపై అమెరికన్లు వ్యతిరేకతతోనే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆయనకు శాంతి బహుమతికి అర్హుడు కాదని 76శాతం అమెరికన్లు భావిస్తున్నారు. ఇటీవల తాము నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని ‘న్యూ వాషింగ్టన్ పోస్ట్’ అనేక కథనాలు ప్రచురించింది.