calender_icon.png 26 July, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఎండ తీవ్రతకు బైక్ దగ్ధం

08-04-2025 12:30:34 AM

కూకట్ పల్లి ఏప్రిల్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్లో ఎండలు భగ్గు మంటున్నా యి. మే నెల రాకముందే భానుడు భగభగ మండుతున్నాడు. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. ముఖ్యంగా ముసలివాళ్లు, చిన్నపిల్లలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మొన్నటివరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తాజాగా కూకట్ పల్లి  జగద్గిరి గుట్టలో ఎండ తీవ్రతకు పల్సర్ బైక్ కాలి బూడిద అయ్యింది. ఎండలో నడిపిస్తుండగా.. అనుకోకుండా వేడి ఎక్కువై ఇంజి న్ నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో రైడర్ బైక్ను పక్కన నిలిపివేసి మంటలను ఆర్పేందుకు యత్నించాడు. సమాచా రం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బైక్ దగ్ధం జరగడం తో బైక్ రైడర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.