calender_icon.png 27 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీం సంభవ ఫౌండేషన్ ఔదార్యం

26-07-2025 08:24:30 PM

గిరిజన విద్యార్థులకు లక్ష రూపాయల విలువైన సామాగ్రి పంపిణీ..

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) లక్ష్మిదేవిపల్లి మండలంలోని తిప్పకుంటా, గట్టుమల్ల, బాబోజీతండా, కొత్తూరు, బట్టుతండా, ప్రాథమిక పాఠశాలల్లోని 150 మంది నిరుపేద గిరిజన విద్యార్థులకు టీం సంభవ ఫౌండేషన్(Team Sambhava Foundation) ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు లక్ష రూపాయల విలువైన బ్యాగులు, నోటు పుస్తకాలు, స్టేషనరి అందజేశారు. హైదరాబాద్ టీం సంభవ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని, విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు.

అనంతరం టీం సభ్యులు మాట్లాడుతూ, గతంలో కన్స్ట్రక్షన్ స్పెషాలిటిస్, ఐటి సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేయూతతో గట్టుమల్ల పంచాయతీ గంగమ్మకాలనీ లో రూ 2 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని ఏర్పాటు చేసిన సందర్బంలో, వాలంటీర్ రూప్లా నాయక్ ఇక్కడి విద్యార్థులకు బ్యాగ్ లను అందించేలా చూడాలని కోరగా, టీం సంభవ ఫౌండేషన్ తరపున విద్యార్థులకు బ్యాగ్స్, నోట్స్, స్టేషనరి అందించడంతో పాటుగా, గంగమ్మ కాలనీ మధ్య గుంపు, వారికి బట్టలు కూడా పంపిణి చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లా ప్రజలకు తమ వంతుగా సహాయ, సహకారాలు అందించేందుకు ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా టీం సంభవ ఫౌండేషన్ సత్యప్రసాద్, పృథ్వి, పురుషోత్తం, దేవి మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.