calender_icon.png 27 July, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎస్జి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ సర్వేలో బేతంపూడిని సందర్శించిన అధికారులు

26-07-2025 08:27:33 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ఎస్ఎస్జి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2025 సర్వేలో భాగంగా శనివారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి గ్రామపంచాయతీని స్టేట్ కో ఆర్డినేటర్  జి సురేశ్, సర్వే టీం  సభ్యుడు రవీచంద్ర  సందర్శించారు. డంపింగ్ షెడ్ పని చేస్తుందా లేదా కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారా లేదా గ్రామంలో పొడి చెత్త తడి చెత్త వేరు చేస్తున్నారా లేదా వేసిన ఎలా డిస్పోస్ చేస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. గ్రామంలోని స్కూల్స్, అంగన్వాడి సెంటర్స్ ,గ్రామపంచాయతీ ఆఫీస్, హాస్పిటల్, రిలీజియన్ మసీదు ప్లేస్ లను విజిట్ చేసి అక్కడ మరుగుదొడ్ల వినియోగం ఇంకుడు గుంతలు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయు విధానం పైన వారి తోటి ఇంట్రాక్ట్ అయ్యి వారి దగ్గర నుంచి అంశాలను తెలుసుకున్నారు. 

గ్రామంలోని 16 ఇండ్లను సందర్శించి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు మరుగుదొడ్ల వినియోగం తర్వాత తడి చెత్త పొడి చెత్త వేరు చేయు విధానం పైన వారితో అంశాలను అడిగి తెలుసుకొని సర్వే వారికి ఇచ్చిన అంశాలను మొబైల్ యాప్ లో డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేశారు.  గ్రామపంచాయతీ నిర్వహిస్తున్న రికార్డుల మెయింటెనెన్స్ తర్వాత ప్రజలకు అవగాహన కోసం వేసే వాల్ పోస్టర్స్ గాని పెయింటింగ్స్ అవన్నీ మొబైల్ యాప్ లో రికార్డ్ చేశారు.