calender_icon.png 27 July, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ జిల్లా పరిషత్ మోడల్ హై స్కూల్ ను సందర్శించిన డీఎంహెచ్ఓ

26-07-2025 08:33:20 PM

వరంగల్,(విజయక్రాంతి): కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ వరంగల్  ఆదేశాల మేరకు  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు వరంగల్ జిల్లా పరిషత్ మోడల్ హై స్కూల్, నర్సంపేట పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడుతూ  పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు భారతదేశానికి భావి పౌరులు కాబట్టి వారికి తెలువవలసిన కొన్ని మెళుకువలు అందులో ప్రధానంగా శారీరక, మానసిక స్థితి, శాస్త్రీయ దృక్పథం, ఆర్థిక సమస్యలపై అవగాహన ఆరోగ్యము పౌష్టికాహారము అలవర్చుకున్నట్లయితే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపారు.

విద్యార్థులు స్వీయ అవగాహన, నైపుణ్యాలు, తోటి వారిపై సానుభూతి, సమస్యల పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రవర్తించాలని తెలిపినారు. భావవ్యక్తీకరణ సరళంగా, సృజనాత్మకమైన ఆలోచనలు, తర్కబద్ధమైన ఆలోచనలు ఉండాలని అన్నారు. అనంతరం  డాక్టర్ భరత్ సైక్రియాటిస్ట్  మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు సమస్యలను సాధారణంగా పరిష్కరించుకోవాలికానీ, మానసిక ఒత్తిడికి గురికాకుండా, వారు ఎలాంటి ఉద్వేగం చెందకుండా, సూసైడ్ అటెంప్ట్ చేయకుండా, ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కారం మార్గాన్ని తేలుసుకోవాలని కోరరు.

విద్యార్థినీ విద్యార్థులు వారి పరీక్షల పైన ,వ్యక్తిగత సమస్యల పైన, సంక్షిప్తమైన ఆలోచనతో, ఆరోగ్యము పౌష్టిక ఆహారంపై అవగాహన కలిగి  పాటించాలని సూచించరు. సమయస్ఫూర్తితో విశ్లేషించకుండా సంఘర్షణకు లోనవుతున్నారు. అట్టి విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, తోటి స్నేహితుల సలహాలు తీసుకొని సంఘములో గౌరవంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం టెలిమానస్ అనే ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వారు 14416 నెంబర్ను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని కోరరు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు అనంతరం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బానోజీపేటలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నర్సంపేట 2 ను సందర్శించి  వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమమును పరిశీలించినారు. అందించే సేవల గురించి తగిన సూచనలు చేస్తూ రికార్డులను తనిఖీ చేసినారు.  ఎవరైనా ఉద్యోగ ధర్మమును సక్రమంగా నిర్వహించకుంటే వారి పైన సీసీఏ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించరు.