26-07-2025 08:41:25 PM
మునగాల,(విజయక్రాంతి): పాలక పార్టీల ప్రభుత్వాలు అధికార దాహంతో అనేక వాగ్దానాలు చేసి ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. శనివారం మాధవరం సిపిఎం పార్టీ గ్రామ శాఖ సమావేశం దేశ గాని వీరబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ... కేంద్రంలోని నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అక్రమ సంపాదన వెలికి తీస్తామని సంవత్సరంకు ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అధికారo లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నేడు పూర్తిగా కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మార్చి వేస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటుపరం చేసే వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి కంపెనీ వ్యవసాయ విధానాలు అమలు చేయాలని చూసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో 13 నెలల పాటు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తే మోడీ దిగివచ్చి వ్యవసాయ చట్టాలను అమలు చేయటం రద్దు పరిచారని అన్నారు ఇప్పటికైనా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.