calender_icon.png 27 July, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన బీజేపీ

26-07-2025 08:37:56 PM

హాజరైన కార్యకర్తలు నాయకులు..

అధ్యక్షుడు దినేష్ కుల చారి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ..

నిజామాబాద్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్‌ సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ ఎల్ ఓ సి వెంబడి ఉన్న కార్గిల్ ప్రాంతంలోని భారత భూభాగంలోకి చొరబడి కీలకమైన పర్వత శిఖరాలను ఆక్రమించారన్నారు. ఈ ఆక్రమణను తిప్పికొట్టడానికి భారత సైన్యం "ఆపరేషన్ విజయ్" ను ప్రారంభించిందనీ, సుమారు రెండు నెలలపాటు తీవ్రమైన పోరాటం జరిగిన దేశ ప్రజలందరికీ తెలుసు అన్నారు. 

ఎత్తైన, కఠినమైన పర్వత ప్రాంతాల్లో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భారత సైనికులు అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి మన సైనికులు అమరులయ్యారన్నారు. 1999 జూలై 26న భారత సైన్యం కార్గిల్‌లోని ఆక్రమిత శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుని సైన్యం దేశానికి విజయం సాధించిందనీ తెలిపారు. ఈ యుద్ధంలో భారతదేశం 527 మందికి పైగా వీర సైనికులను కోల్పోయింది. వారి త్యాగాలను, ధైర్యాన్ని స్మరించుకుంటూ, ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంతున్నామన్నారు. బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..

కార్గిల్ విజయ్ దివాస్ కేవలం ఒక విజయోత్సవం కాదు, ఇది మన సైనికుల అకుంఠిత త్యాగాలను, దేశభక్తిని గుర్తుచేసే పవిత్ర దినం. పాకిస్తాన్ దురాక్రమణను తిప్పికొట్టి, కార్గిల్ పర్వతాలపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన మన వీర జవాన్ల ధైర్యం, నిబద్ధత ప్రతీ ఒక్కరికీ ఆదర్శప్రాయం" అని అన్నారు.

దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిది. తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తూ, మనల్ని సురక్షితంగా ఉంచుతున్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడమే కాకుండా, వారి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

ఈ యొక్క కార్యక్రమంలో పొతన్ కార్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, నగ్గొల్ల లక్ష్మి నారాయణ, మల్లేష్ యాదవ్, కొడూర్ నాగారాజు, దొంతుల రవి, ఆనంద్ రావు, ఇప్పాకాయల కిషోర్, మెట్టు విజయ్, బొబ్బిలి వేణు, పడాల భూపతి, గిరిబాబు, పంచారెడ్డి శ్రీధర్, హరీష్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.