26-07-2025 08:25:05 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఇంతకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా కార్పొరేట్ శాలరీ ఖాతా కలిగిన ఉద్యోగులకు ప్రమాద బీమా కింద నుంచి రూ.1.25 కోట్లు బ్యాంకు ఇచ్చే విధంగా ఒప్పందం చేయడం జరిగిందని ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఇల్లందు ఏరియాలోని జి.ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సాలరీ అకౌంట్ స్కీం క్రింద మార్చుకున్నట్లయితే పది(10) లైఫ్ ఇన్సురన్స్ ప్రమాద బీమా వర్తించే విధంగా సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కావున పంజాబ్ నేషనల్ బ్యాంక్ నందు శాలరీ ఎకౌంటు కలిగిన ఉద్యోగులు తమ ఎకౌంటును పంజాబ్ నేషనల్ సూపర్ శాలరీ ఆకౌంటు స్కీం క్రింద సంబంధిత బ్యాంకు శాఖ నందు మార్చుకొని ప్రమాద బీమా సౌకర్యాన్ని పొందవచ్చని సూచించారు.