26-07-2025 08:21:55 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జీఎం కార్యాలయం ఏరియా యాజమాన్యం, ఏరియా ప్రాతినిధ్య సంఘం ప్రతినిధుల మధ్య ఏరియా స్థాయి నెలవారి సమావేశం శనివారం ఏరియా జీ.యం వి.కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశం లో భాగంగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (SCMLU-INTUC) తరపున జే.వెంకటేశ్వర్లు ఏరియా వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇల్లందు ఏరియా లో పనిచేసే కార్మికులు వారి పని స్థలాలలో ఎదుర్కొనే పలు సమస్యలను, విన్నపాల గురించి ప్రాతినిధ్య సంఘం తరపున ఏరియా జీఎం దృష్టి కి తీసుకువచ్చి సమస్యల పరిష్కార దిశకై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఏరియా జీ.యం. శ్రీ వి.కృష్ణయ్య గారు స్పందించి,సాధ్యమయ్యంత వరకు ప్రతి సమస్యను పరిష్కరించే విధం గా చర్యలు చేపడతామని తెలిపారు.