calender_icon.png 29 January, 2026 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

03-10-2024 08:51:19 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ కుకునూరు మండలం పెదరావిగూడెంకు చెందిన నడిపింటి వినోద్, సరిత దంపతులు సరిత అనారోగ్య నిమిత్తం భద్రాచలంలోని ఓ ఆస్పత్రికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో సారపాక ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని పివై01సిఎల్ 7575 నెంబర్ గల ప్రవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సరిత అక్కడికక్కడే మృతి చెందగా వినోద్ తీవ్ర గాయాపడ్డాడు. దీంతో వినోద్ ను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వినోద్ కుమార్ తల్లి సరోజినీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు.