calender_icon.png 29 January, 2026 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన

29-01-2026 02:03:05 PM

న్యూఢిల్లీ: లోక్ సభలో ఆర్థిక సర్వే 2025-26ను(Economic Survey 2025-26) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురువారం విడుదలైన ఆర్థిక సర్వే, 2026-27 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.8 నుండి 7.2 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7.4 శాతం కంటే కొద్దిగా తక్కువ. కేంద్ర ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రస్తావన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఏటా తగ్గుతూవస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది.

తెలంగాణలో ద్రవ్యోల్బణం 8.61 నుంచి 0.20 శాతానికి తగ్గిందని సర్వే సూచించింది. ఏపీలో ద్రవ్యోల్బణం 7.57 నుంచి 1.39 శాతానికి దిగి వచ్చిందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం జాతీయ సగటు 1.72 శాతం కంటే తక్కువుందని సర్వే వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడి జాతీయ సగటు కంటే తక్కవ నమోదైందని తెలిపింది. తెలంగాణ, ఏపీలోనే ధాన్యం దిగుబడి తక్కువగా నమోదైనట్లు ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అకాల వర్షాల వల్ల వ్యవసాయ దిగుబడి తక్కువగా నమోదైంది. కొత్త నగరాల విస్తరణలో అమరావతి గురించి ఆర్థిక సర్వేలో  మంత్రి నిర్మలా సీతారామన్  ప్రస్తావించారు.