29-01-2026 02:16:54 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పార్టీ లైన్ ఎవరు దాటకూడదని.. ఒక్కరు రెండు నామినేషన్లు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోమని బహిష్కరించడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
గతంలో పట్టణాన్ని ఆగం చేశారని, గడిచిన 75 సంవత్సరాల కాలవ్యవధిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పట్టణాన్ని ఆగం చేసి కాలయాపన చేశారని అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. అతి తక్కువ కాలంలో రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. మన ప్రాంతానికి కావలసిన అన్ని సదుపాయాలను సమకూర్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాలమూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో 30,40 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారి సూచనలను సలహాలు తీసుకొని పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన అందరూ మద్దతు తెలిపేలా కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. తమతోపాటు కాంగ్రెస్ పార్టీ మూడు సర్వేలను చేయడం జరుగుతుందని జనాదరణ పొందిన నేతలకు టికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ పత్రంలో కూడా ప్రతి ఒక్కరూ ఐఎన్సి అని రాయాలని, అలాకాకుండా ఎవరి ఇష్టంనుసారంగా వారు నామినేషన్ల దాఖలు చేస్తే పార్టీ బహిష్కరించే అవకాశం కూడా ఉందన్నారు. మేయర్ నేనంటే నేను అని డిప్యూటీ మేయర్ నేనే అని చెప్పుకోవడం సరికాదని మీడియా కూడా ఇస్తాను సారంగా ఈ విషయంలో హైప్ చేయకూడదని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పూర్తిస్థాయిలో పార్టీ అధిష్టానం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎవరు మేయర్? ఎవరు డిప్యూటీ మేయర్?నిర్ణయించడం జరుగుతుందని ఈ విషయాన్ని కార్యకర్త గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు. టికెట్ రానివారు స్వచ్ఛందంగా పార్టీ లైన్ ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు తెలిపారు. కొత్త కాంగ్రెస్ బిచ్చగా పార్టీ ముందుకు సాగుతుందని ఏదో జరిగిపోతుందని ఎవరు అనుకోకూడదని తెలిపారు. అందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకు సాగుతుందని తెలిపారు.
పట్టణాన్ని ఆగం చేసిండ్రు : సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
గెలిపి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు గతంలో పూర్తిస్థాయిలో పట్టణాన్ని ఆగం చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. అందర్నీ సమన్వయం చేసేందుకు ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే పలువురికి పద్ధతులు అప్పగించడం జరిగిందని తెలిపారు. మంచి రోజులు అనుకూలమైన రోజులు అంటూ నామినేషన్లు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐఎన్సి అని రాయాలని, ఒకరు ఒకటే నామినేషన్ వేయాలని రెండో దానికి అవకాశం లేదన్నారు. పార్టీ లైన్ దాటితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేవరకద్రలో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, భూత్పూర్ లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ఎన్పి వెంకటేష్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్ల కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సిహ రెడ్డి, మత్స్య సహకార జిల్లా చైర్మన్ గోనెల శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.