calender_icon.png 4 February, 2026 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త డేట్ ప్రకటించిన బైకర్

04-02-2026 12:00:00 AM

‘నారీ నారీ నడుమ మురారి’తో ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు స్టార్ హీరో శర్వానంద్. ఇక ఆయన ఇప్పుడు ‘బైకర్’ చిత్రంతో అలరించనున్నారు. ఇందులో ఆయన మోటార్ సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోందీ సినిమా. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్, సాంగ్‌తో ఇప్పటికే మంచి అంచనాలేర్పడ్డాయి. వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే, మేకర్స్ తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 3న ఈ సినిమా  విడుదల కానున్నట్టు వెల్లడించారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే బైకర్ రేసింగ్ యాక్షన్‌తోపాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్; డీవోపీ: జే యువరాజ్; ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్; ఎడిటర్: అనిల్ కుమార్ పీ; ఆర్ట్: ఏ పనీర్ సెల్వం; నిర్మాతలు: వంశీ, -ప్రమోద్; రచన, దర్శకత్వం: అభిలాష్‌రెడ్డి కంకర.