ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు
అధికారులకు మూడేళ్ల జైలు, ౧౦ వేల జరిమానా
ఎల్లారెడ్డి కోర్టు జడ్జి హరిత తీర్పు
కామారెడ్డి, జూన్20(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో అవతకవలకు పాల్పడ్డ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.౧౦ వేల జరిమానా విధిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కోర్టుల న్యాయమూర్తి హరిత తీర్పు నిచ్చా రు. 2009లో లింగంపేట్ పోలీస్‌స్టేషన్లో అవతకవతలకు పాల్పడిన అధి కారులపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు చార్జీషీట్‌ను దాఖలు చేశారు. హౌజింగ్ శాఖ ఏఈ సంపత్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు మహిళలు వజ్రమ్మ, రాజమణికి మూడేళ్ల జైలు, రూ.౧౦ వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించకుంటే మరో ఆరు నెలలు శిక్ష అనుభ వించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల అవినీతికి సంబంధించి అధికారులకు ఇలాంటి శిక్ష విధించడం తొలిసారి కావడంతో కామారెడ్డిలో చర్చనీయాంశంగా మారింది.






