07-07-2025 12:17:29 AM
వలిగొండ,జులై 6 (విజయక్రాంతి): మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వారి ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను సవరిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను, చట్టాలను మారుస్తూ పెట్టుబడిదారులకు ఉపయోగపడే లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందని,
ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికులకు సాధించుకున్న హక్కులను పూర్తిగా కోల్పోతున్నారని అన్నారు. ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికుల పనిగంటల విధానం పెరిగి, పని పెరిగి శ్రమ దోపిడీ కి గురవుతారని, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాధారపు మల్లేశం, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు కొండే నరసింహ, భవననిర్మాణ కార్మిక సంఘం,
గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకత్వం మల్గా బీరప్ప, ఉక్కుర్తి రాములు, తాళ్ల సత్తయ్య, చేరకుf అంజయ్య, చేగురి నాగేష్, కందుల శ్రీను, దొడ్డి మురళి, సుంకరి కృష్ణ, కలిమేర సుదర్శన్, పద్మయ్య, కొమ్ము. లింగస్వామి, శామల మల్లేష్, మూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు.