calender_icon.png 7 July, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

07-07-2025 12:16:17 AM

-రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించిన 

- రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య

ములుగు,జూలై6(విజయక్రాంతి): యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య  అన్నారు ఈరోజున ములుగు జిల్లా క్రీడాకారులు జులై 11నుంచి 13వరకు ఉత్తనూర్ గద్వాలలో జరుగబోయే రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ కు ఎంపికైన ములుగు జిల్లా క్రీడాకారులను అభినందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య సన్రైజర్స్ హై స్కూల్ కరస్పాండెంట్ పెట్టం రాజు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపు దక్కుతుందని అదేవిదంగా నిత్యం క్రీడల్లో సాధన చేస్తే మానసిక ఉల్లాసం కలుగుతుందని యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పేర్కొన్నారు అదేవిదంగా క్రీడాకారులకు బాస్కెట్ బాల్ కిట్లు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మారం సుమన్ రెడ్డి  సీనియర్ నాయకులు నల్లేల భరత్ కుమార్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ బాస్కెట్ బాల్  కోచ్ అంబాల వంశీ  తదితరులు పాల్గొన్నారు.