calender_icon.png 11 August, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజే పీకి పుట్టగతులు ఉండవు

06-08-2025 01:44:36 AM

  1. బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి 
  2. రెండు రోజులు పార్లమెంట్‌లో చర్చ పెట్టాలి 
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల 
  4. కాంగ్రెస్ ధర్నాకు మద్దతు  

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బీసీ బిల్లు విషయంలో మోసం చేస్తే బీజీపీకి పుట్టగతులు ఉండవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్‌ను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపి మూడు నెలలు అవుతున్నా ఇప్పటివరకు పట్టించుకోలేదని, బీసీలకు  అన్యాయం చేస్తోందని విమర్శించారు.

మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియా తో జాజుల మాట్లాడుతూ రిజర్వేషన్లు పెం చాలని బీసీలు పోరాడుతున్నప్పటికీ కేంద్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును పార్లమెంట్‌లో పెట్టి తొమ్మి దో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ, ఆ పనిచేయకుండా గల్లీలో, హైదరాబాదులో ధర్నా లు చేయడం సిగ్గుచేటన్నారు.

బీజేపీకి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేపట్టాలని లేదా పీఎంను ఒప్పించి బీసీ రిజర్వేషన్లు పెంచి బీసీల మన్ననలు పొందాలని సూచించారు. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీల నోటికాడు ముద్దను గుంజుకుంటే బీ జేపీకి తెలంగాణలో రాజకీయంగా పుట్టగతు లు ఉండవన్నారు. బీసీలపై వ్యతిరేక వైఖరి అవలంబిస్తే బీసీల ద్రోహుల పార్టీగా చరిత్ర లో మిగిలిపోతుందని హెచ్చరించారు.

అవసరమైతే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను అడ్డుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ ఆధ్వర్యం లో జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు. ధ  సమావేశంలో బీసీ కులసంఘాల జేఏసీ చై ర్మన్ కుందారం గణేశ్‌చారి, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సర్పంచుల ఫో రం రాష్ర్ట కన్వీనర్ జనగాం రవీందర్ గౌడ్, బీసీ సంఘాల నేతలు అక్కినపల్లి శ్రీనివాస చారి, పెద్ది వెంకటనారాయణ గౌడ్, కడమూరు ఆనంద్  తదితరులు పాల్గొన్నారు.