06-08-2025 01:45:58 AM
- శేరిలింగంపల్లిలో అత్యధికంగా 2.92 సెం.మీ వర్షపాతం
- గంటల కొద్దీ స్తంభించిన ట్రాఫిక్
- రంగంలోకి సహాయక బృందాలు
- జలమయమైన రహదారులు
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి పంజా విసిరాడు. మంగళవారం సాయంత్రం నగరాన్ని భారీగా వర్షం ముం చెత్తింది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం తడిసి ముద్దయింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 2.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, గంటల వ్యవధిలోనే నగరం అతలాకుతలమైంది. పగలంతా ఎండ, ఉక్కపోతతో అల్లా డిన నగరవాసులపై సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఉరుము లు మెరుపులతో కూడిన కుండపోత వాన దంచికొట్టింది.
కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, వా హనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. నిమిషాల వ్యవధిలోనే నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, యూసు ఫ్‌గూడ వంటి ప్రధాన రహదారులన్నీ జలమయమై, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో నగరవాసులు గంటల తరబడి ఇబ్బం దులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, రహదారులపై నిలిచిన వరదనీటిని తొలగిం చేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు.
ఎక్కడ ఎంత వర్షం? (సెం.మీలలో)
జీహెచ్‌ఎంసీ నివేదిక ప్రకారం, వర్షం ప్రధానంగా నగరంలోని పశ్చిమ, వాయువ్య ప్రాంతాలలోనే కేంద్రీకృతమైంది. సర్కిల్-20 (శేరిలింగంపల్లి): 2.92 సెం.మీ, సర్కిల్-22 (రామచంద్రాపురం & పటాన్‌చెరు): 2.80 సెం.మీ, సర్కిల్-21 (చాందానగర్): 2.43 సెం.మీ, సర్కిల్-19 (యూసుఫ్‌గూడ): 1.04 సెం.మీ నమోదవగా మరోవైపు జూబ్లీహిల్స్ (0.1 సెం.మీ), గచ్చిబౌలి (0.08 సెం.మీ), కూకట్‌పల్లి (0.07 సెం.మీ), ఉప్పల్ (0.05 సెం.మీ) వంటి ప్రాంతాల్లో కేవలం చిరుజల్లులతో సరిపెట్టగా, అనేక ఇతర ప్రాంతాల్లో వర్షం నామమాత్రంగానే నమోదైంది.