03-08-2025 12:25:32 AM
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ స్వా తంత్య్రం కోసం ప్రారంభమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బ్రిటీష్ వాళ్లతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ అని.. ఈ విషయాన్ని బీజేపీ వాళ్లకు తాను గుర్తు చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్, జేడీ (యూ), బీజేడీ, ఆర్జేడీలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన పార్టీలని తెలిపారు. కానీ ఈ దేశానికి రాజ్యాం గాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. 2001 నుంచి నరేంద్ర మోదీ కుర్చీ వదలడంలేదని, వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుందన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆన్వల్ లీగల్ కాన్‌క్లేవ్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
రాహుల్ అనుకుంటే అప్పుడే ప్రధాని అయ్యేవారు
2004లో కేంద్రంలో యూపీఏ- అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవిని స్వీకరించాలని అంతా సోనియాగాంధీని కోరినప్పటికీ ఆమె దానిని త్యాగం చేసి మ న్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రి చేశారని, రాష్ర్టపతి అవకాశం వచ్చినా వదులుకొని ప్ర ణబ్ ముఖర్జీని రాష్ర్టపతి చేశారని సీఎం తెలిపారు.
రాహుల్‌గాంధీ చేసిన త్యా గం బీజేపీ వాళ్లకు అర్థం కాదని, ఆయన అ నుకుంటే 2 004లోనే కేంద్రమంత్రి, 2009 లోనే ప్రధానమంత్రి అయ్యే వారని, కానీ ఆ రెండింటిని ఆయన త్యాగం చేశారన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా రాహుల్ గాంధీ పోరాడుతునారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో మోదీని దింపేస్తం
మోదీని ఆర్‌ఎస్‌ఎస్, వాజ్‌పేయీ కుర్చీ నుంచి దింపలేకపోయారని, కానీ వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ మోదీని కుర్చీ నుంచి దింపేస్తారని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ లేకుంటే బీజేపీకి 150 సీట్లు కూడా రావని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ప్రకటించారని, అయితే దూబే తన డైరీలో రాసిపె ట్టుకోవాలని, వచ్చే ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో పోరాడుతామని, బీజేపీకి 150కి మించి ఒక్క సీటు రాదన్నారు.
భారత్ జోడో యాత్రతో కులగణన
ఓబీసీలకు సామాజిక న్యాయం సాధించే ందుకు రాహుల్‌గాంధీ నేతృత్వంలో తాము పోరాడుతామన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర చేసిన సమయంలో తెలంగాణలో కులగణనకు రాహుల్‌గాంధీ ఇ చ్చిన హామీ మేరకు ఆయనకు బాసటగా తె లంగా ణ ప్రజలు ప్రేమ దుకాణాలు (మొహబ్బత్ కా దుకాణ్) తెరిచారని, అందుకే తాము తెలంగాణలో కులగణన చేసి దేశానికి తెలంగాణ మోడల్ ఇచ్చామన్నారు.
గెలిస్తే పదవిలో... ఓడిపోతే ఇంట్లో
ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికలొస్తే పోటీ చేయడం, గెలిస్తే పదవిలో కూర్చోవడం, ఓడిపోతే ఇంట్లో కూర్చోవడం అలవా టైపోయిందన్నారు. బీజేపీ నుంచి మొదలు కొని చాలా విపక్ష పార్టీలు ఇలాగే వ్యవహరిస్తున్నాయన్నారు.
ఓడిపోయాక ప్రజల మ ధ్యకు రావడం లేదని, గెలిచినప్పుడే కనిపిస్తున్నారని విమర్శించారు. కానీ కా ంగ్రెస్ పార్టీ మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉ ండి, ప్రజల కోసం పని చేసే రాజకీయ పా ర్టీగా నిలుస్తో ందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఆ నిబంధన మోదీకి వర్తించదా?
ముఖ్యమంత్రి అయింది మొద లు ఇప్పటివరకు పీఎం నరేంద్ర మో దీ కుర్చీ వదలడం లేదని, ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినా మోదీ వినడం లేదని సీఎం విమర్శించారు. రెండు నెలల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఫ్‌ుచాలక్ మోహ న్ భాగవత్ 75 ఏళ్లు నిండిన వారు కుర్చీ వదలాలని చెప్పినా మోదీ వదులుకునేందుకు సిద్ధంగా లేరన్నారు.
ఒక సందర్భంలో వాజ్‌పేయి కూడా మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలని ప్రయత్నించారని, ఈరో జు మోహన్ భగవత్ కూడా మోదీని ప్రధాని పదవి నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అద్వాణీ, మురళీ మనోహర్ జోషికి వర్తించే నిబంధనలు మోదీకి వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు.