03-08-2025 12:25:47 AM
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం)గా ఇతి పాండే శనివారం రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 1998 బ్యాకు చెందిన ఇతి.. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో గోల్డ్ మెడల్ పొందారు. రైల్వేశాఖలో వేర్వేరు డివిజన్లలో ఆమె పనిచేశారు.
గతంలో ఆమె భూసావాల్ డివిజన్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. చీఫ్ కమర్షియల్ మేనేజర్ సహా అనేక ఉన్నతస్థాయి పదవుల్లో ఆమె పనిచేశారు. భూసవాల్ డీఆర్‌ఎంగా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో రైల్వే కార్మికుల ప్రయోజనం కోసం మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు.