calender_icon.png 3 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్, జగదీశ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

03-08-2025 12:24:09 AM

  1. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  2. వాదనల అనంతరం కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

హైదరాబాద్, ఆగస్టు 2: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 2024 లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయావకాశాలను దెబ్బతీ యాలనే దురుద్దేశంతో, తన పరువుకు నష్టం వాటిల్లేలా కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయించా రని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ఇచ్చారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల తో పాటు మరికొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆధారాలు లేకుండా తమపై పెట్టిన తప్పుడు కేసును కొట్టేయాలని కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఫిర్యాదులోని అంశాలకు సంబంధించి ఆధారా లు సమర్పిం చాలని దర్యాప్తు అధికారి మార్చి 15, జూన్ 18న నోటీసులు జారీ చేసినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పం దించలేదని కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వా దించారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి జస్టిస్ మౌషుమి భట్టాచార్య తీర్పు వెలువరిచారు. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్ నాయకులకు ఊరట లభించినట్టయింది.