06-08-2025 12:49:23 AM
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు
బాన్సువాడ ఆగస్టు 5 (విజయ క్రాంతి): బిజెపి పార్టీ దేశంలోని పేద ప్రజల అభ్యున్నత కోసం పాటుపడుతుందని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు తెలిపారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మంగళవారం బాన్సువాడ పట్టణంలో, మండలంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ముఖ్యఅతిథిగా ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ తెలంగాణలో మార్పు రాలే బతుకులు మారలే సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దినెక్కడం జరిగింది తీరా ఈరోజు ముఖ్యమంత్రి నన్ను కోసుకొని తిన్న డబ్బులు లేవు అనడం సిగ్గుచేటు గత ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి హామీలు సాధ్యం కావని తెలిసి దొంగ హామీలు ఇస్తూ ఎలాగైనా అధికారం కావాలని దాహంతో అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పైడిమల్ లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ రామకృష్ణ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాధర్ రావు సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ శంకర్. వెంకట్ కొండని గంగారం పాశం భాస్కర్ రెడ్డి తోట శంకర్‌సాయి రెడ్డి సాయిబాబా పాల్గొన్నారు.