06-08-2025 12:51:14 AM
బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
వరంగల్/ వర్ధన్నపేట.ఆగస్టు 05(విజయ క్రాంతి): వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చీమల బిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికి బిజెపి - ప్రతి గడప గడపకి బూత్ అధ్యక్షుడు‘ ’మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్‘ పాల్గొని గ్రామీణ వికాసం బిజెపితొనే సాధ్యం అనే నినాదంతో గడప గడపకు వెళ్లి 11 ఏళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
గ్రామీణ జీవనోపాధి మెరుగుపర్చడం కోసం 56 లక్షల మందికి పని కల్పించి 22,000/- కోట్లు వెచ్చించింది బిజెపి. చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలతో సాకరమైన మహిళా సాధికారత వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి గ్రామభివృద్ధికి తోడ్పడుతుదన్నారు. బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, మీ గ్రామం అభివృద్ధికి తొడ్పాటు అందించాలని అన్నారు.
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పట్టపురం ఏకాంతం గౌడ్, మండల ప్రభారి రేసు శ్రీనివాస్ మరియు మండల ప్రధాన కార్యదర్శి జాటోత్ రవి, ఉపాధ్యక్షులు గోనె సంపత్, కిసాన్ మోర్చా అధ్యక్షులు చీమల చంద్రయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు గొల్లపల్లి సంతోష్, మండల ఉపాధ్యక్షులు పాయలి యాకయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బాదావత్ మారుతి, బూత్ అధ్యక్షులు నవీన్, భాస్కర్.వెంకన్న. కుమారస్వామి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు తాటికాల నరసయ్య, సీనియర్ నాయకులు భోగ సుధాకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.