06-08-2025 12:48:20 AM
హనుమకొండ టౌన్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): మేరా యువభారత్ ( నెహ్రూ యువ కేంద్ర) వరంగల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై యువతకు ఒకరోజు వర్క్ షాప్ ను హనుమకొండ లక్ష్మీపురంలో మేరా యువ భారత్ సమావేశపు హాలులో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హనుమకొండ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్.
మొదట వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఎదగలనుకునేవారు, భవిష్యత్తులో వ్యాపారం చేయదలచుకున్నవారు ఆరంగానికి సంబంధించిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని జిల్లా పరిశ్రమల శాఖ అందిస్తున్న పీఎం సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, స్టార్టప్ ఇండియా, పద్దెనిమిది రకాల వృత్తులగల వారికి పీఎం విశ్వకర్మ పథకాల ద్వారా ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, ట్రైనీస్, జన శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందుతున్న వివిధ కోర్సుల ట్రైనీస్, ప్రథమ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్, జనశిక్షణ సంస్థాన్ జిల్లా డైరెక్టర్ ఖజా ముసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.