09-02-2025 06:42:57 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బిజెపి పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించిన సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి జిల్లా నాయకులు పట్టి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సారధ్యంలో ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి అధికారాన్ని చేపట్టిందని అన్నారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఢిల్లీ ప్రజలు బిజెపికి పట్టం కట్టారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బిజెపిని విమర్శించకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, పానుగంటి మధు, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, పట్టణ కార్యదర్శి సల్లం సుమలత, బూతు అధ్యక్షులు పులి ప్రశాంత్, పుల్లూరి రాము, కోదాటి స్వర్ణలత, కోదాటి కళావతి, చింత కింది లావణ్య, ఎర్రోజు శ్రీనివాస్, వడ్నాల స్వామి గౌడ్, షేక్ బాబా, పూత రాజుల శంకర్, గంపల చంద్రమౌళి, మాదాసు ప్రీతం తదితరులు పాల్గొన్నారు.