calender_icon.png 22 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించండి

09-02-2025 06:46:23 PM

పిఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాసరావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మద్దతు పలకాలని టీఎస్ పిఆర్టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏటుకూరి శ్రీనివాసరావు, సునార్కర్ అనిల్ కుమార్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పిఆర్టియుటిఎస్ ఉపాధ్యాయ సంఘం బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న పిఆర్టియు ఎల్లప్పుడు ఉపాధ్యాయ సంక్షేమం కోసం పాటుపడుతుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడిగా సేవలందించిన మహేందర్ రెడ్డిని గెలిపించి మన సమస్యలను గళం విప్పెందుకు శాసన మండలికి పంపిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఇందారపు ప్రకాష్, గోర్ సింగ్, కుమ్మరి రవి, తొడసం సోనేరావు, సునార్కర్ భరత్, కవిత, శ్రీలత, జాడి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.