calender_icon.png 10 November, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్ డి డి ఎం పద్మావతి

10-11-2025 04:32:12 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామ పరిధిలో గల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ పద్మావతి పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోలు కేంద్రంలోని పత్తిని, ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు.

రైతులకు ఎకరాకు ఏడు క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వచ్చినట్లయితే ఏఈఓ వద్ద ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని అన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించిన వివరాలను కూడా ఏఈఓ దగ్గర నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సరిత, సిపిఓ సంతోష్ కుమార్, ఇన్చార్జి సెక్రెటరీ రమేష్, భాస్కర్ తదితరు పాల్గొన్నారు.