10-11-2025 04:48:50 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సందర్శించారు. ఆసుపత్రి నూతనంగా భవనంలోకి మార్చినాక అన్ని వసతులు సదుపాయాలు గిరిజన ప్రాంతానికి అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఎమ్మెల్యే స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగేల భూషణ్ ,వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్ ,ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, తదితరులు ఉన్నారు.