10-11-2025 04:38:46 PM
అన్నదానంలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ సాంబశివ దేవాలయంలో పూజారి పారువెల్ల రమేష్ శర్మ ఆధ్వర్యంలో శివుడికి అన్నపూజ, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్ సదా లక్ష్మీ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారి పారువెళ్ల రమేష్ శర్మ, వారి కుమారుడు సాయి ప్రణవ్ శర్మలు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమితో పాటు నెలరోజుల పాటు జరిగిన నగర సంకీర్తన పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించుకోవడం జరిగిందన్నారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి... నెల రోజులపాటు సేవలందించిన వారందరికీ... భక్త బృందానికి ఆ శివుడి ఆశీస్సులు ఉంటాయని పూజారి పారువెల్ల రమేష్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి వల్ల కొండా మఠం రమేష్, పూజారి పారువెల్ల రమేష్ శర్మ అసిస్టెంట్ రామ్మోహన్, డాక్టర్ పురం విజయకుమార్, రామిడి హాసిని మునిందర్, పురం కవిత, గుణలత, తాటిపల్లి శోభారాణి భూపతి, బొమ్మల శ్రీనివాస్, నగునూరి శ్రీనివాస్, కామనీ శంకరయ్య, ప్రముఖ సామాజిక సేవకుడు పల్లా కిషన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పల్లా వాసు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కొమురవెల్లి శ్రీనివాస్, అవోప అధ్యక్షులు కొమురవెల్లి కాశీపతి, ఓదెల దేవస్థానం డైరెక్టర్ సామల యమునా హరికృష్ణ దంపతులు, కొమురవెల్లి(కేబి) శ్రీనివాస్, తొడుపునూరి రాజేంద్రప్రసాద్, కొమురవెల్లి అంజయ్య, కొమురవెల్లి సత్యం, భగవాన్, పెద్ద ఎత్తున భక్త బృందం పాల్గొన్నారు.