10-11-2025 04:46:41 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): దుర్షేడ్ డివిజన్లో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ ను నేడు ప్రారంభించిన కోరుకంటి కుటుంబ సభ్యులు కీర్తిశేషులు శ్రీ కోరుకంటి దామోదర్ రావు జ్ఞాపకార్థం వారి కుమారులైన కోరుకంటి సన్నత్ కుమార్, కోరుకంటి వెంకటేశ్వరరావు వారి తండ్రి పేరుమీద సుమారు 11 లక్షల రూపాయలు వెచ్చించి.. మినీ హాల్ నిర్మించారు. నిరుపేద కుటుంబాలు ఫంక్షన్ హాల్లో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందనీ వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మా తండ్రి పేరు మీద సొంత ఖర్చుతో నిర్మాణం చేయడం జరిగిందనీ వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోరు కంటి వెంకటేశ్వరరావు, నందాల తిరుపతి సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి మాజీ ఉపసర్పంచ్ సుకిశాల సంపత్ రావు. సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, జోగినిపల్లి రఘునందన్ రావు, కోరుకంటి వేణుమాధవరావు, జువాడి రాజేశ్వరరావు. ఆత్మ చరణ్ రావు, ప్రతాప్ రావు, మరియు కోరుకంటి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.