31-10-2025 02:21:49 PM
 
							హైదరాబాద్: బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) హనుమకొండలో(Hanamkonda) వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వివేక్ నగర్, సమ్మయ్యనగర్, 100 ఫిట్ రోడ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యం వల్లే వరంగల్, హనుమకొండలో ఈ పరిస్థితి నెలకుందని విమర్శించారు. ముందస్తు వరద నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ ఈటల కోరారు.