calender_icon.png 23 July, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడి సొంతింటి కల ఎప్పుడూ నెరవేరుతుంది

23-07-2025 01:39:28 PM

బీజేపీ మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్

మంథని,(విజయక్రాంతి):  పేదోడి సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందని బిజెపి మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులు నిర్మిస్తామని హామీ ఇచ్చిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవస్ యోజన క్రింద సగం నిధులు ఇస్తున్న ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ గత ప్రభుత్వం మాదిరిగానే రోజుకో మాట  చెప్పుతుందన్నారు. ఎంతో ఆశతో పేద ప్రజలు నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, పేద ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే  స్థానిక ఎన్నికలకు ముందే వెంటనే మంథని మండల పరిధిలోని గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లిస్టును వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలని రాజేందర్ డిమాండ్ చేశారు.