23-07-2025 01:35:11 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా 161 వ జాతీయ రహదారిపై పక్కన గల నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతుంది. ఇది కల్లేరు 45 అంత సంగారెడ్డి జిల్లా లోని నల్లవాగు ప్రాంతంతో పాటు ఎగువ భాగంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతుంది.
వర్షాకాలంలో మొట్టమొదటి మత్తడి పొంగిపొర్లడం నల్లవాగు కావడంతో నల్లవాగు మత్తడిని చూసేందుకు సమీపం లోని పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతూ మంజీరాలోకి పరవళ్ళు తొక్కుతుండడంతో మంజీర ప్రాంతంలో వానాకాలం పంటల సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.