calender_icon.png 24 July, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18.1 అడుగులకు చేరిన పాకాల సరస్సు

23-07-2025 08:04:37 PM

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు(Pakhal Lake)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సరస్సులోకి క్రమంగా వరద వస్తోంది. వారం క్రితం వరకు పాకాల సరస్సులో 17.6 అడుగుల నీరు ఉండేది. బుధవారం ఉదయానికి 18.1 అడుగులకు చేరుకుంది. పాకాల కింద సుమారు 20 వేలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ వర్షాలకు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.