23-07-2025 08:07:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): వర్షాకాలం భారీ వర్షాల నేపథ్యంలో నిత్యం ఎండకు, వానకు ఉంటూ ఉపాధి కోసం అల్లాడుతున్న చిరు వ్యాపారులకు తమవంతుగా జిల్లా కేంద్రానికి చెందిన వైద్యుడు చిటికేశి శ్రీనివాస్ సాయం అందించారు. జిల్లా కేంద్రానికి చెందిన నిర్మల వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ కూరగాయల మార్కెట్లో బుధవారం ఉదయం వంద గొడుగులను పంపిణీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో చిరు వ్యాపారులకు ఇబ్బంది కలుగకూడదని తమవంతు ప్రయత్నం చేసినట్లు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూన రమేష్, గంగిశెట్టి ప్రవీణ్, సభ్యులు చార్టెడ్ అకౌంటెంట్ సాయి ప్రసాద్, శ్రీధర్, హరీష్, మహేష్, వినోద్, నిఖిల్, గజేందర్, మొయిజ్, అనూప్ తదితరులు పాల్గొన్నారు.