23-07-2025 01:43:20 PM
కరీంనగర్: జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుండి భారీగా వర్షం కురుస్తుంది. కరీంనగర్ నగరం తో పాటు చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతాలలో వర్షం ఇంకా కురుస్తుంది. ఈ ఉదయం 9 గంటల వరకు జిల్లాలో అత్యధికంగా మానకొండూరు లో 75.8 మిల్లి మీటర్, జమ్మికుంటలో 78 మి.మీ, కొత్తపల్లి లో 66.80 మి.మీ, సైదాపూర్ లో 68.8 మి.మీలో వర్షపాతం నమోదు అయింది. కరీంనగర్ నగరంలో తట్టు ప్రాంతాలు జలమయం కావడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాల ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో ప్రక్క ఏకదాటిగా కురుస్తున్న వర్షాల్తో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు