calender_icon.png 11 September, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా తీసుకురావడంలో బీజేపీ మంత్రులు, ఎంపీలు విఫలం

11-09-2025 06:57:55 PM

రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్..

చిట్యాల (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాను రాష్ట్రానికి తీసుకురావడంలో బీజేపీ మంత్రులు, ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ అన్నారు. గురువారం చిట్యాల మండల కేంద్రంలో ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ రైతులకు కావలసిన యూరియా రూపాయి వంతు అయితే అర్ధ రూపాయివంతుగా విడుతలవారీగా అందజేయడం సిగ్గుచేటు అన్నారు. మిగతా యూరియా ఎప్పుడొస్తదో రైతుల బాధలు ఎప్పుడు తీరుతాయో అని ఆవేదన వ్యక్తం చేశారు.

షాపుల ముందు గంటల తరబడి రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అందించవలసిన యూరియా ప్రైవేటు డీలర్లకు ఎట్లా అందిస్తున్నారని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా సరిపడ యూరియా అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు బోరగని రాజు, పోతుగంటి సాంబయ్య, రాజయ్య, రవీందర్, మొగిలి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.