11-09-2025 06:51:31 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఉపయోగకరామైన రసాయనలను తయారు చేసే విధానంపై రసాయన శాస్త్రంలో పరిశోధన చేసినందుకు హైదరాబాద్ సి.ఎస్.ఐ.ఆర్, ఐ.ఐ.సి.టి ద్యారా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఉప్పరపల్లికి చెందిన కత్తుల నరేష్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. డాక్టర్ వినీత్ అన్నయ్య పర్యవేక్షణలో వ్యర్థ ప్లాస్టిక్ ను విలువైన ఉత్పత్తులుగా మార్పిడి చేయడానికి సమర్థవంతమైన పేరకాల మార్గాల మదింపు అనే అంశంపై సృజనాత్మకమైన పరిశోధన నిర్వహించి పర్యావరణానికి మేలు చేకూరే విధంగా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేసి రసాయన ఇంజనీరింగ్ రంగంలో విశిష్ట కృషి చేసినందుకు పీహెచ్డీ పట్టా అందుకున్నారు. నరేష్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి డాక్టరెట్ పొందడం పట్ల ఉప్పరపల్లి వాసులు హర్షం వ్యక్తం చేసారు.