calender_icon.png 11 September, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏచూరి స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాడుదాం..

11-09-2025 07:00:14 PM

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్..

అదిలాబాద్ (విజయక్రాంతి): కామ్రేడ్ స్వర్గీయ సీతారాం ఏచూరి చూపిన పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణపై పోరాడాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్(CPM Party District Secretary Darshanala Mallesh) పిలుపునిచ్చారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో సీపీఎం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ... సీతారాం ఏచూరి విద్యార్ధి దశ నుండే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. భారత రాజకీయాల్లో అనునిత్యం ప్రజాపక్షం వహిస్తూ అనేక పోరాటాలను నడిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంకా రాఘవులు, అన్నమొల్ల కిరణ్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, స్వామి, పలువురు నాయకులు పాల్గొన్నారు.