03-12-2025 12:24:50 AM
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్
నిర్మల్, డిసెంబర్ ౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థగా బలో పితం చేసినందుకు సమిష్టి కృషితో కష్టపడి పని చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు వేడుమ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ నటరాజన్ మీనన్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతు లమీదుగా జిల్లా డిసిసి అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు.
రాజకీయ చైతన్యమున నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీ నాయకు లు కార్యకర్తల సమిష్టి కృషితో సమన్వయం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిపించుకునేందుకు కృషి చేస్తాన ని పేర్కొన్నారు జిల్లా బాధితులను అప్పగించిన పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.