calender_icon.png 6 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అన్ని స్థానాల బరిలో నిలవాలి

06-10-2025 07:09:29 PM

చిట్యాల (విజయక్రాంతి): రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ పార్టీ అన్ని స్థానాల బరిలో నిలవాలని మండల అధ్యక్షుడు పీక వెంకన్న సోమవారం తెలిపారు. స్థానిక ఎన్నికలు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్, ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చిట్యాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 

బీజేపీ నాయకులు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల ప్రజలకు వివరించాలని, లబ్ధిదారులని కలవాలని సూచించారు. పార్టీ తరఫున అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలవాలని, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు పొట్లపల్లి నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి పున్న విష్ణు, ఆకుల వెంకన్న, వరికుప్పల నరసింహ, ఉయ్యాల లింగస్వామి, గడిగల కోటేష్, కోరబోయిన లింగస్వామి, పొలిమేర నరసింహ, అనిల్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.