calender_icon.png 6 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలిగొండను కమ్మిన కారుమబ్బులు

06-10-2025 07:02:12 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వలిగొండ గుట్టపైన దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వలిగొండ గుట్టపైన ఉన్న శివాలయంలోని శివుడు జడలు విదిల్చాడ అన్నట్లుగా నల్లని మబ్బులు జడల వలె కనిపించాయి. దట్టమైన నల్లని మబ్బులు భారీ వర్షాన్ని కురిపిస్తాయని భావించగా జనం ఉరుకులు, పరుగులు తీశారు. వరి కోతలు మొదలుపెట్టిన రైతులు తన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లను కప్పడం కనిపించింది. అయితే కొద్దిసేపటికి మబ్బులన్నీ మాయమయ్యాయి.