calender_icon.png 7 October, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

07-10-2025 12:16:37 AM

దేశంతో ప్రతి చోట ఓటు చోరీ చేసింది బిజెపి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి 

వనపర్తి, అక్టోబర్ 06 ( విజయక్రాంతి ) : ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో 100 మందితో సంతకాల సేకరణ చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది. వనపర్తి జిల్లాలోసంతకాల సేకరణలో భాగంగా గోపాల్ పేట్ మండ లం జయన్న తిరుమలాపురం గ్రామంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి పార్టీ పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రంలో బిజెపి పార్టీ పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసిందని లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించారన్నారు. ఎన్నికల సంఘం కానీ బిజెపి పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన వాస్తవాలు తప్పు అని చెప్పాలేక పోయరన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్,ఎన్‌ఎస్‌యుఐ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రోహిత్, తదితరులు పాల్గొన్నారు.