calender_icon.png 10 October, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ భద్రకాళి నిత్య అన్నదాన వితరణలో పాల్గొన్న సేవకులు

10-10-2025 06:54:43 PM

వరంగల్,(విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో  విభూప్రసాద అన్నపూర్ణ సదనం లో ఏర్పాటు చేసే నిత్యాన్నదాన కార్యక్రమంలో  మధ్యాహ్నం సేవలో భాగంగా భద్రకాళి అమ్మవారి సేవకులు పాల్గొని, భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం, భక్తులకు భోజన వితరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం సీనియర్ సేవకురాలు జన్నతి విజయలక్ష్మి కి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, అభినందించారు. ఈ సేవా కార్యక్రమంలో ఆడేపు స్రవంతి, జన్నతి విజయలక్ష్మి, బొల్లం స్రవంతి, తోట నరసమ్మ, గుమ్మడి అరుణ, రజిత, పోతు సంధ్యారాణి, బొలిశెట్టి సంధ్య తదితరులు పాల్గొన్నారు.