10-10-2025 06:19:00 PM
తెలంగాణ సింగరేణి ఉద్యల సంఘం డిమాండ్
బెల్లంపల్లి అర్బన్: బెల్లంపల్లిలో సింగరేణి భూములు అమ్ముకొని కోట్లు గడిస్తున్న నాయకులు తమ అక్రమాలను వెంటనే ఆపాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నీరటి రాజన్న, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ సమ్ము రాజయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సౌత్ క్రాస్ కట్ గని కబ్జా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కబ్జాలను సింగరేణి అధికారులు. సింగరేణి సెక్యూరిటీ విభాగం సిబ్బంది, పట్టించుకోకపోవడం వల్లనే స్థలంను ఆక్రమించేస్తున్నారని పేర్కొన్నారు.
భూకబ్జాల ప్రయలను అడ్డుకున్న రాత్రికి రాత్రే దేవుళ్ళ పేరిట గద్దెలు నిర్మించి భూ అక్రమానకు తెరాలేపిండ్లు. ప్రభుత్వ ఆస్తులను కాపాడల్సిన శాసన సభ్యులు అక్రమాదారులకు అండగా నిలువడం సరియైనది కాదాని, ఇట్టి సింగరేణి కాలి స్థలాలను ఆక్రమించాక ముందే ఇండ్లు లేని పేద ప్రజలకు, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కారర్మికులకు, కార్మిక సంఘాల ఆఫీస్ నిర్వహణకు కేటాయించాలని సింగరేణి అధికారులను ప్రభుత్వ అదికూలను, శాసన సభ్యులు వినోద్ ని కోరారు. ఆక్రమాలను ఆపకుంటే ఇక్కడ జరిగే విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధమని హెచ్చరించారు.