10-10-2025 06:45:33 PM
వరంగల్,(విజయక్రాంతి): వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోగిని మెడికవర్ వైద్యులు ప్రాణాపాస్థితి నుండి రక్షించారు. 51 సంవత్సరాల వయస్సు గల రాజారావు అనే రోగి గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలతో వరంగల్ మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చారు. దీర్ఘకాలం ధూమపానం చేసే అలవాటు ఉన్న ఈ రోగి గుండె వేగంగా కొట్టుకోవడం, మరియు మూర్ఛ వంటి లక్షణాలతో ఇతర ఆసుపత్రికి వెళ్ళగా, ఈసీజీలో మోనోమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాకీకార్డియా ఉన్నట్లు తేలింది.
అనంతరం రోగి బంధువులు రోగిని మెడికవర్ హాస్పిటల్‌లోకి తీసుకొచ్చేసరికి, అధిక పల్స్ రేటు, రక్తపోటు 60 సిస్టాలిక్‌గా నమోదైంది. రోగి కార్డియోజెనిక్ షాక్‌లో ఉన్నాడని గ్రహించిన వెంటనే డా. సంతోష్ మొదాని, కన్సల్టెంట్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మరియు డా. లక్ష్మీ దీపక్, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్,డా. సుష్మ ప్రియాంక కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ నేతృత్వంలోని వైద్య బృందం సింక్రొనైజ్డ్ డి సి.కార్డియోవర్షన్ చేసి రోగిని సాధారణ గుండె తాకిడికి (సైనస్ రిధమ్) తీసుకవచ్చారు.ఈకో టెస్ట్‌లో గుండె విస్తరించి ఉండటం మరియు ఎడమ వెంట్రికిల్ పనితీరు తీవ్రంగా తగ్గిపోవడం గుర్తించారు.
కోరోనరీ యాంజియోగ్రఫీలో మాత్రం రక్తనాళాలు సాధారణంగా ఉన్నట్లు తేలింది. సరైన చికిత్సతో రోగి షాక్ మరియు కిడ్నీ సమస్య నుండి పూర్తిగా కోలుకున్నారు.భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకు రోగికి ఏఐసిడి ఏర్పాటు చేయాలని వైద్యులు సూచించారు.డా. సంతోష్ మొదాని మాట్లాడుతూ కార్డియాక్ అరిత్మియా అనేది సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు ప్రధాన కారణాలలో ఒకటి అని ప్రారంభ దశలో గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నమ్రత మరియు మార్కెటింగ్ హెడ్ హరినాథ్ గుప్తా పాల్గొన్నారు.