calender_icon.png 4 July, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బీజేపీ కృషి

04-07-2025 01:16:59 AM

జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్

మందమర్రి, జూలై 3 : ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణకు, పాఠశాలల బలోపేతానికి బిజెపి కృషి చేస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ స్పష్టం చేశారు. మండలంలోని అందుగులపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల  విద్యార్థులకు బిజెపి నాయకులు దార రవిసాగర్ ఆధ్వర్యం లో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించి, ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని డిమాం డ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సంస్థలు వసతులు మెరుగు పరచాలని కోరారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగిన కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు  జనార్ధన్, ఇంచార్జ్ సంజీవరావు, కన్వీనర్ అక్కల రమేష్, పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు