04-07-2025 01:25:09 AM
భారత్ ఫ్యూచర్ సిటీ కేరాఫ్‌గా మహేశర్వం
రంగారెడ్డి, జూలై 3 (విజయక్రాంతి): రానున్న రోజుల్లో భారత్ ఫ్యూచర్ సిటీ కేరాఫ్‌గా మహేశ్వరాన్ని ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడమే కాదు లాభాలను చేకూర్చేలా చేయడమూ తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందు కే ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక పాలసీలను మార్చలేదని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలోని ఇండస్ట్రీయల్ పార్క్‌లో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ కేంద్రాన్ని గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందు కు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పా రు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకొచ్చిన వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.
ఇప్పటివరకు హైదరాబాద్ ఫార్మా, ఐటీ రంగాలు గుర్తుకురాగా ఆ జాబితాలో జ్యువెలరీ రంగం కూడా చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హై దరాబాద్ శివారులో ఎలక్ట్రానిక్ క్లస్టర్, మహేశ్వరంలో జ్యువెలరీ తయారీ యూనిట్లు, జహీరాబాద్‌లో ఈవీఈం అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2023--24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఉత్పత్తి రంగం వృద్ధి రేటు 9.6 శాతం కాగా అది జాతీయ సగటు 8.3 శాతమేనన్నారు.
మలబార్ సంస్థ స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందంజలో ఉండాలన్నారు. వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని విజన్-2047 ప్రణాళికను రూపొందించుకున్నామని సీఎం చెప్పారు. నగర అభివృద్ధి కోసం సింగపూర్, ఇతర దేశాల ప్రపంచ స్థాయి కన్సల్టెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణపై నమ్మకంతో మలబార్ గ్రూప్ ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు సంస్థకు సీఎం అభినందనలు తెలిపారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతులు: మంత్రి శ్రీధర్‌బాబు
కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తయారీ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉందని, సగటున 9 శాతానికి పైగా వృద్ధి సాధిస్తున్నట్టు చెప్పారు. గ్రీన్ ఇండస్ట్రియల్ నూతన ఎంఎస్‌ఎంఈ--2025పాలసీని ప్రభుత్వం ఆమోదించిం దని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఇప్పటివరకు 4,200 దరఖాస్తులు రాగా పదిహేనురోజుల్లోనే 98 శాతం దరఖాస్తులను పరిష్క రించామని తెలిపారు. నూతన పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా సింగి ల్ విండో విధానంలో పారదర్శకంగా వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నా రు.
2035 నాటికి తెలంగాణను ట్రిలియ న్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మ న్ నిర్మలారెడ్డి, మలబార్ గ్రూప్స్ చైర్మన్, ఎండీ అహ్మద్, వైస్ చైర్మన్ సలీం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్ ఏకే, కలెక్టర్ నా రాయణరెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కేఎల్‌ఆర్ తదితరులు పాల్గొన్నారు.