22-07-2025 12:59:55 AM
కూకట్‌పల్లి, జులై 21 (విజయక్రాంతి): జేఎన్టీయూ సరస్వతి బాలికల వసతి గృహంలో నాగుపాము కనిపించడంతో విద్యార్థినిలు ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యా హ్నం రెండు గంటల సమయంలో సరస్వతి హాస్టల్ కార్యాలయం వద్ద నాగుపాము కనిపించడంతో భయభ్రాంతులకు గురై హాస్టల్ గదిలో నుంచి కూడా బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
వసతి గృహంలో ఎప్పటికప్పుడు గడ్డి చెత్త వ్యర్ధాలను తొలగించాలని వార్డెన్ చీఫ్ ఇంజినీర్‌ను వేడుకొన్నారు. విద్యార్థినిలు పామును గుర్తించకపోతే గది లోకి వెళ్ళి ప్రాణ నష్టం జరిగేదని వపోయారు. తక్షణమే అధికారులు స్పం దించి మరోసారి ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని విద్యార్థినిలు కోరారు.