7 August, 2026 | 2:30 AM

వీజేఐటీలో బీజేవైఎం సంతకాల సేకరణ

07-08-2026 12:00 AM

మొయినాబాద్ ఆగస్టు 6 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం హిమాయత్నగర్లోని విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీజేఐటీ)లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ల జాప్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం చేవెళ్ల కన్వీనర్ షాపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మమతారెడ్డి, పార్టీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.